గ్రామాల అభివృద్ధే లక్ష్యం.. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ధ్యేయమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, గ్రామ సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం వారు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రాధాన్యత క్రమంలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులకు కొత్త రేషన్ కార్డుల మంజూరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పకీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, సంధ్య, శారద, భార్గవ్, శోభ, వెంకటేశం, వెంకటమ్మ, మాజీ ఉప సర్పంచ్‌లు శ్రీహరి, బుచ్చిరెడ్డి, నాయకులు బద్రి లింగయ్య, సత్తయ్య, కృష్ణయ్య, లింగారెడ్డి, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.