ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో పలు అధికారిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లింగోజిగూడెం గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ గృహాలను మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి పండుగలో పాల్గొని నాభి శిలకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతకుముందు చౌటుప్పల్ మండలం లక్కారంలోని ఎస్ఎంఆర్ నిషిక కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
