విధుల పట్ల నిర్లక్ష్యం ఆలయ అర్చకుడిపై సస్పెన్షన్ వేటు….

విధుల పట్ల నిర్లక్ష్యం ఆలయ అర్చకుడిపై సస్పెన్షన్ వేటు….
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఒక అర్చకుడిపై ఆలయ ఈఓ కఠిన చర్యలు తీసుకున్నారు. తన విధులకు ముందస్తు అనుమతి లేకుండా హాజరుకాకపోవడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వంటి ఆరోపణలపై సదరు అర్చకుడిని తాత్కాలికంగా విధుల నుండి తొలగిస్తూ (సస్పెండ్ చేస్తూ) ఉత్తర్వులు జారీ అయ్యాయి.దేవస్థానంలో అర్చకుడిగా పనిచేస్తున్న యం.
తిరుపతిరావు పై అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. ఆలయ తనిఖీదారు ఇచ్చిన ఫిర్యాదు నివేదిక ఆధారంగా ఆలయ ఉప కమిషనర్ & కార్యనిర్వహాణాధికారి (ఈఓ) బి. మహేశ్వరరెడ్డి ఈ మెమో జారీ చేశారు.సదరు అర్చకుడిపై అధికారులు తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు ప్రతిష్టకు భంగం చేస్తూ బాధ్యతాయుతమైన అర్చక వృత్తిలో ఉంటూ విధులకు రాకపోవడం వల్ల ఆలయ గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలిగించారు.మార్పు లేని ప్రవర్తన గతంలో కూడా ఇతని ప్రవర్తనపై పలుమార్లు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
తోటి సిబ్బందిపై ప్రభావం పడే ఇతని బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్ల తోటి ఉద్యోగులలో కూడా క్రమశిక్షణ లోపించడానికి రణమయ్యారు. చట్టపరమైన చర్యలు వివరణకు ఆదేశం చేసిన ఈఓ ఈ తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనపై దేవాదాయ ధర్మాదాయ చట్టం 30/87 నందలి సెక్షన్ 37(1) ప్రకారం సదరు అర్చకుడిని విధుల నుండి తాత్కాలికంగా తొలగించారు. ఈ ఉత్తర్వులు అందిన 10 రోజులలోగా తన ప్రవర్తనపై కార్యాలయానికి లిఖితపూర్వక సంజాయిషీ (వివరణ) సమర్పించాలని ఆదేశించారు. గడువులోగా సరైన వివరణ ఇవ్వని యెడల, అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ఈఓ హెచ్చరించారు.
