వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం……….

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం……….

పెనుగంచిప్రోలు మే 1 (ఆంధ్రప్రభ ):గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దత్తత ఆలయమైన శ్రీధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం రాత్రి స్వామివారు, అమ్మవార్ల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అందంగా అలంకరించిన మండపంపై స్వామివారు, అమ్మవార్ల విగ్రహాలు నిలిపి ఆలయ ప్రధానార్చకులు పరాంకుశం సీతాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణ పీటలపై వంశ పారంపర్య ధర్మకర్తలు, పలువురు దంపతులు కూర్చొన్నారు. కల్యాణానికి ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు తీపసుకువచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply