DK.Balaji | సైకిల్ పై ప్రయాణం చేసిన కలెక్టర్..

DK.Balaji | సైకిల్ పై ప్రయాణం చేసిన కలెక్టర్..

  • స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

DK.Balaji | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి శ్రమదాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ పాల్గొన్నారు. తొలుత శ్రమదానం కార్యక్రమానికి సైకిల్ పై రిజిస్టర్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ (Collector) ప్రతి మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులందరూ తమ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో స్వచ్ఛ కార్యక్రమాలను ప్రతి మూడవ శనివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

DK.Balaji

గూడూరు వరకు సైకిల్ పై వెళ్లిన కలెక్టర్..

మచిలీపట్నం నగరం నుంచి సైకిల్ పై ప్రయాణిస్తూ పెడన (Pedana) నియోజకవర్గం గూడూరులోని రైతు సేవ కేంద్రం వద్ద శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం బల్లిపర్రులో శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పురోగతి పరిశీలన, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

DK.Balaji

Leave a Reply