anaira gupta| తెలుగు, తమిళ సినిమాల్లో యువ నటి జోరు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలుగు, తమిళ చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటి అనైరా గుప్తా దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. తొలి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తున్న ఆమె, ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

అనైరా గుప్తా ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. హుషారు (2018) చిత్రంలో సహాయక పాత్ర ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, తన స్క్రీన్ ప్రజెన్స్‌తో గుర్తింపు పొందింది. అనంతరం సర్కార్ చిత్రంలో విజయ్తో కలిసి వచ్చిన ‘సిమ్టాంగారన్’ పాటలో కనిపించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వితైక్కారన్, అన్వేషి వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకుంది. గ్లామర్‌తో పాటు సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ, విభిన్న పాత్రల్లో తనదైన ముద్ర వేస్తోంది.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో కొంబుసీవి ఒకటి. ఈ తమిళ చిత్రానికి పొన్రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తెలుగు చిత్రం పురుషహ‌లో “దేవనాయకి” పేరుతో రూపొందుతున్న ప్రత్యేక గీతంలో అనైరా కనిపించనుంది. వరుస అవకాశాలతో దక్షిణాది చిత్రసీమలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది.