ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ వేగవంతం చేయాలి
ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ వేగవంతం చేయాలి
రైస్‌మిల్లులను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ నగేష్
నార్సింగి,ఆంధ్రప్రభ : నార్సింగి మండలంలో ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్‌లో ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆదివారం రైస్‌మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లుల్లో ధాన్యం నిల్వలు, రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియలను పరిశీలించారు. రైస్‌మిల్ యజమానులతో మాట్లాడిన అడిషనల్ కలెక్టర్ నగేష్ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం త్వరితగతిన అన్‌లోడింగ్ చేసి నిల్వ చేయాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే వాహనాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, లోడింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులు, డ్రైవర్లు గంటల తరబడి వేచి ఉండకుండా సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు, మిల్లర్లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎం జగదీష్ కుమార్, డి సి ఎస్ ఓ నిత్యానందం, హాయ్ శ్రీధర్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
