Anand Deverakonda | సరికొత్తగా వస్తున్న ఎపిక్..

Anand Deverakonda | సరికొత్తగా వస్తున్న ఎపిక్..

Anand Deverakonda | ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ‘ఎపిక్’పై భారీ అంచనాలు
కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన కథల ఎంపిక
2025లో సినిమా లేకపోవడానికి కారణం ఇదే
బేబీ తర్వాత మరోసారి ఆనంద్–వైష్ణవి చైతన్య జోడీ
ఎపిక్ మూవీ ప్రోమోతో క్రియేట్ అవుతున్న బజ్
డ్యూయెట్, తక్షకుడు సినిమాలతో ఆనంద్ ప్లాన్స్
క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్న ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటిస్తూ.. యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్న ఆనంద్ కు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ (Middile Class Melodies) వంటి సినిమాలు ఆనంద్ స్క్రిప్ట్ సెలెక్షన్ కు నిదర్శనంగా నిలుస్తాయి. బేబి మూవీ ఆనంద్ కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి సక్సెస్ అందించింది. వంద కోట్ల గ్రాసర్ గా కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆనంద్ దేవరకొండను ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చింది. ఇప్పుడు ఎపిక్ అంటూ రాబోతున్నాడు. అయితే.. ఈమధ్య గ్యాప్ తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అసలు గ్యాప్ ఇచ్చాడా..? గ్యాప్ వచ్చిందా..? ఎపిక్ మూవీ ఎలా ఉండబోతుంది..?

Anand Deverakonda

Anand Deverakonda | కెరీర్ స్టార్టింగ్ నుంచి..

2019లో ఆనంద్ దేవరకొండ దొరసాని అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత 2020లో మిడిల్ క్లాస్ మెలోడీస్, 2021లో పుష్పక విమానం, 2022లో హైవే, 2023లో బేబి, 2024లో గం గం గణేషా సినిమాలు చేశాడు. అయితే.. 2025లో ఆనంద్ దేవరకొండ నుంచి ఏ సినిమా రిలీజ్ (Release) కాలేదు. ఇప్పుడు ఎపిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. యంగ్ హీరో సంవత్సరానికి రెండు సినిమాలు చేయచ్చు కానీ.. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సంవత్సరానికి ఒక్క సినిమానే రిలీజ్ చేసేవాడు. అయితే.. లాస్ట్ ఆ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

Anand Deverakonda

Anand Deverakonda | అసలు కారణం ఇదే..

ఎందుకు స్పీడుగా సినిమాలు చేయడం లేదు అంటే.. వేగంగా సినిమాలు చేయడం కంటే.. క్వాలిటీగా మూవీస్ ఎంచుకోవడానికే ఆనంద్ ప్రాధాన్యతనిస్తున్నాడని తెలిసింది. అందుకే.. ఆనంద్ చేసిన ప్రతి సినిమాలో (Movies) ఒక వేరియేషన్, స్ట్రాంగ్ కంటెంట్ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో ఆనంద్ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో మంచి లవ్ ఎంటర్ టైనర్ డ్యూయెట్ తో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో నటిస్తున్న ఎపిక్ సినిమా ఉంది. ఎపిక్ మూవీ ప్రమోషనల్ కంటెంట్ తోనే ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఆనంద్ చేసిన తక్షకుడు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతోంది.

Anand Deverakonda

Anand Deverakonda | కల్ట్ బ్లాక్‌బస్టర్ బేబీ తర్వాత..

ఎపిక్ చిత్రానికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ మూవీ నుంచి ప్రోమో రిలీజ్ చేశారు. లండన్ లో స్నేహితుల సమక్షంలో హీరో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, ఇండియా నుంచి పేరెంట్స్ ఆనంద్ (Anand) కు ఫోన్ చేసి విష్ చేయడం, తండ్రి చెప్పీ చెప్పనట్లుగా కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఈ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమోకు బీజీఎంగా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్ పెట్టడం కొత్త ఫీల్ కలిగించింది. కల్ట్ బ్లాక్‌బస్టర్ బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సంచారమే.. పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రేజీ కాంబోలో వస్తున్న ఎపిక్ మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఆనంద్ కి మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందనే ఫీలింగ్ కలిగించింది. మరి.. లేట్ అయినా ఫరవాలేదు.. లేటెస్ట్ గా మంచి కంటెంట్ అందించాలి.. వరుసగా సక్సెస్ సాధించాలనే ఆనంద్ ప్లాన్ ఎపిక్, డ్యూయెట్, తక్షకుడు చిత్రాలతో ఫలిస్తుందేమో చూడాలి.