24constituencies | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వ కసరత్తు

24constituencies | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వ కసరత్తు

24constituencies | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది. నగరంలోని 24 నియోజకవర్గాల్లో ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తొలి విడతలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిసి నాంపల్లి, మలక్‌పేట్‌, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలను పరిశీలించారు. కుల్సుంపురా, అఫ్జల్ సాగర్ ప్రాంతాలతో పాటు కాలదేరా, గడ్డియన్నారం ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలించి నివేదికలు సేకరించారు.

పేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. నగరంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను గుర్తించి గృహ నిర్మాణానికి వినియోగించనున్నట్లు చెప్పారు. అర్హులైన పేద కుటుంబాలకు మెరుగైన వసతులతో ఇళ్లు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply