ఓటర్ జాబితా సవరణపై అఖిలపక్ష సమావేశం..
చిట్యాల, ఆంధ్రప్రభ : పలు రాజకీయ పార్టీల తోటి ఓటర్ సవరణపై సమీక్ష నిర్వహించినట్లు చిట్యాల ఇన్చార్జి తహసిల్దార్ బక్కతట్ల విజయలక్ష్మి తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని పలు రాజకీయ పార్టీల నాయకులతో చిట్యాల ఎమ్మార్వో కార్యాలయంలో తాసిల్దార్ బక్కతట్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి పార్టీ నుండి ఓటర్ సవరణ కోసం ఒక వ్యక్తిని నియమించాలని వారిని కోరారు. అంతేకాకుండా ఎవరెవరికి రెండు ఓట్లు ఉన్నాయో అటువంటి వాటిని తొలగించి ఓటర్ సవరణపై ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. చనిపోయిన వారు, వలస వెళ్లినవారు ఉన్నటువంటి ఓట్లను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని మీ ఏరియాలో ఉన్నటువంటి బిఎల్ఓ ల సహకారంతో సవరణ చేసే విధంగా అన్ని పార్టీ నాయకులకు సహకరించాలని వారు కోరారు.
