Andhra Pradesh | నలుగురికి గాయాలు

Andhra Pradesh | నలుగురికి గాయాలు
Andhra Pradesh | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
యర్రగొండ్లపాలెం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఢీకొన్న తీవ్రతకు రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
