Competitions | హాసకొత్తూరులో ముగ్గుల పోటీలు
Competitions | హాసకొత్తూరులో ముగ్గుల పోటీలు
Competitions | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని హసకొత్తూర్ గ్రామంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ రోజు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామీ ఆలయంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొని గెలుపొందిన విజేతలకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు.
మొదటి బహుమతి దర్పల్లి సంజన,రెండవ బహుమతి ముండ్ల వనిత, మూడవ బహుమతి భవిష్య రాణిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బంగ్లా లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాధారపు గంగాధర్, సెక్రేటరీ కుందేటి సత్య నారాయణ, క్యాషియర్ ముగాల శ్రీను, ఉపసర్పంచ్ ఏనుగు మనోహర్, సభ్యులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.
