రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ ను కలిసిన ఆలేరు చైర్మన్

ఆలేరు,ఆంధ్రప్రభ : రాష్ట్ర మున్సిపల్ శాఖ కమీషనర్, డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవిని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ హైదరాబాదులో సోమవారం కలిశారు. డాక్టర్ శ్రీదేవిని శాలువాతో సన్మానించి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రసాదాన్ని చైర్మన్ అందజేశారు. ఆలేరు మున్సిపల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఆమెకు చైర్మన్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈఎన్సీని కలిసి మునిసిపాలిటీకి ఏఈ ని కేటాయించాలని, డిటిసిపిని కలిసి టౌన్ ప్లానింగ్ అధికారిని నియమించాలని కోరారు.

Leave a Reply