గురువు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం..

గురువు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం..

ఆనాటి చదువు వల్లే మేము ఉద్యోగాలు స్థిరపడ్డాము…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : చదువు అనేది ఎవరో దొంగలించలేని వస్తువుని అది జ్ఞాపక శక్తికి మంచి విలువైన బహుమానం ఇస్తుందని గురువులు పేర్కొన్నారు. తనకు చదువు చెప్పిన గురువుల సన్మానం చేసిన పూర్వ విద్యార్థులు తమ సంతోషాన్ని చాటుకున్న వైనం నంద్యాల మండలం రాయమాల్ పురం ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. రాయమాల్పురం పాఠశాలలో సోమవారం వార్షికోత్సవం సందర్భంగా గతంలో పనిచేసిన 1998నుంచి 2002 ఉపాధ్యాయులు సూర్యపోగు ఐజయ్య ను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు.

గతంలో తన వద్ద చదువుకున్న మేము ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నామన్నారు. లెక్చరర్లుగా, టీచర్లుగా, పోలీసులుగా పనిచేస్తున్నారని అందుకు ఆనాడు చెప్పిన చదివే ముఖ్యమని పూర్వపు విద్యార్థులు పేర్కొనటం విశేషం.ఎస్ సీ, ఎస్ టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల సుబ్బన్న మాట్లాడుతూ 28 సంవత్సరాల క్రితం పనిచేసిన గురువును సన్మానించడం గొప్ప పరిణామమన్నారు.

పని చేసే ఉపాధ్యాయులను క్రమశిక్షణతో చదువు చెప్పి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను సమాజం తప్పక గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. రాయమాల్పురం పాఠశాలకు మంచి ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. పాఠశాల అభివృద్ధి తో పాటు ప్రజల భాగస్వామ్యంతో విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ నాయక్ ఉపాధ్యాయులు అనంత లక్ష్మీ, ఓబయ్య, సుజాత, సత్యవతమ్మ పూర్వపు విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు..

Leave a Reply