AI Based | ఉద్యోగులు మీ ఆరోగ్యం పైలం..

AI Based | ఉద్యోగులు మీ ఆరోగ్యం పైలం..

AI Based | మెద‌క్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్‌లోని డా. B R అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మూడో అంతస్థులో సెక్రటేరియట్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రేనోవా హాస్పిటల్స్(Raynova Hospitals) అద్వర్యం లో ఏర్పాటు చేసిన AI Based మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపు(Mega Cardiac Health Camp)ను ప్రారంభించారు.

ఈ హెల్త్ క్యాంపులో సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆద్వర్వంలో వచ్చిన ఉద్యోగులకు రేనోవా హాస్పిటల్ అద్వర్యంలో వచ్చిన వైద్య సిబ్బంది అత్యాధునిక ఎక్విప్ మెంట్(Equipment) సాయంతో BP, GRBS, ECG, 2D Echo పరీక్షలను నిర్వహించారు. కార్డియాలజీ, జనరల్ ఫిజీషియ‌న్‌ సేవలను, free కన్సల్టేషన్ సేవలను ఉద్యోగులకు అందించారు.

ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా(Minister Damodar Rajanarsimha) మాట్లాడుతూ.. మారుతున్న జీవన శైలిలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికుందన్నారు. సచివాలయ ఉద్యోగులకు హెల్త్ క్యాంపు పెట్టి వైద్య సేవలను, పరీక్షలను ఉచితంగా అందించిన రేనోవా ఆసుపత్రి వైద్య సిబ్బందిని మంత్రి దామోదర్ రాజనర్సింహా అభినందించారు.