ట్రాక్టర్‌, బైక్ ఢీ..

ఒక‌రి పరిస్థితి విషమం

కొత్తగూడ, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బూరుగుగుంపులో సమీపంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదుట ట్రాక్టర్, బైక్ ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్ర‌మాదంలో గంగారం మండలం మడగూడం గ్రామానికి చెందిన కల్తి విక్రమ్ (ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నట్లు సమాచారం) గాయ‌ప‌డ‌టంతో 108 లో నర్సంపేట కు తరలించారు. ప్రస్తుతం విక్రమ్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply