Accident|విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు – ఇద్దరు ఐటి ఉద్యోగులు దుర్మరణం

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ సమీపంలోని ఏదులాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదులాబాద్‌ వద్ద అదుపుతప్పిన కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

బాధితులు మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, మాధారంలోని విందుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను కుంట్లూరుకు చెందిన భార్గవ్‌, సైనిక్‌పురికి చెందిన వర్షిత్‌గా గుర్తించామన్నారు. ప్రమాదంలో ప్రవీణ్‌ యాదవ్‌, దినేశ్‌ గాయపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు

Leave a Reply