Adilabad | అంబేద్కర్ కృషితోనే రిజర్వేషన్ ఫలాలు

Adilabad | అంబేద్కర్ కృషితోనే రిజర్వేషన్ ఫలాలు

Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Dr. Babasaheb Ambedkar) పుణ్యంతోనే రిజర్వేషన్ ఫలాలు వచ్చాయని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్(Ritish Rathore) అన్నారు. ఈ రోజు ఉట్నూర్ ఐబి చౌరస్తాలో భారత రాజ్యాంగ దివాస్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకలకు రితీష్ రాథోడ్ ముఖ్య‌ అతిథిగా పాల్గొని ఉట్నూర్ ఐబి చౌక్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రితీష్ రాథోడ్ మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షే ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ మిగతా రిజర్వేషన్లు ఏవైనా పొందుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఉట్నూర్ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్. ఎస్టి మోర్చా జిల్లా కార్యదర్శి రాథోడ్ శేషారావు, లీగల్ సేల్ నాయకులు న్యాయవాది బాణావత్ జగన్ నాయక్, మాజీ ఎంపీటీసీ సిపతి లింగా గౌడ్, బీజేపీ నాయకులు ఉష్కముల దేవిదాస్, సాడిగే రాజేశ్వర్, గంగాధర్, అర్జున్ సింగ్, విజయ్, పందిరి భీమన్న, బాణావత్ సంగీత, కాలేరి గంగాధర్, వెంకటేష్, సత్యనారాయణ పాల్గొన్నారు.