Railway station | నాటు బాంబుల కలకలం..
భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబులు బయటపడటంతో కలకలం రేగింది. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చెత్తకుప్పలో పడి ఉన్న మూడు సంచులను రైల్వే పారిశుద్ధ్య సిబ్బంది అక్కడే పడేయగా, వాటిలో ఉన్న ఐదు నాటు బాంబుల్లో ఒకదాన్ని వీధి కుక్క కొరికిపెట్టడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి ఆ కుక్క అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు చెత్త కుప్పను పరిశీలించి.. మిగిలిన నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం వెళ్తున్న రైలులో ఈ బాంబులను తరలించేందుకు ఎవరో ప్రయత్నించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.

