road construction | ప్రజల సంక్షేమమే నా ధ్యేయం

road construction | ప్రజల సంక్షేమమే నా ధ్యేయం
- ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
road construction | ముధోల్, ఆంధ్రప్రభ : నియోజకవర్గ ప్రజల సంక్షేమమే నా ధ్యేయమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. మండలంలోని మచ్కల్ గ్రామంలో రూ.10 లక్షల(Rs. 10 lakh) నిధులతో గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులు తమ పొలాలకు అన్ని కాలాలలో సులభంగా వెళ్లేందుకు వ్యవసాయ రోడ్డు సౌకర్యంగా ఉండాలని, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ రోడ్డు నిర్మాణం(road construction)తో వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగి, పంటల రవాణా మరింత సులభం కానుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోరి పోతన్న, తాటివార్ రమేష్, మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, రైతులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

