Media Cricket | ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో…

Media Cricket | ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో…

  • కొనసాగుతున్న క్రికెట్ పోటీలు…!

Media Cricket | ముధోల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రింట్ – ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల‌కు చెందిన క్రికెట్ జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. అదే విధంగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని పలు పట్టణాలకు చెందిన క్రికెట్ జట్లు సైతం పాల్గొంటూ గట్టి పోటీనిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కావడంతో క్రికెట్ పోటీలు విద్యార్థులు, యువకులకు కనువిందు చేస్తున్నాయి. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి దోహదపడతాయి.

Media Cricket

ప్రతిరోజు రెండు మ్యాచ్లు నిర్వహిస్తుండడంతో చూడడానికి స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. క్రీడాకారులు సైతం ఎంతో ఉత్సాహంగా తమలోని క్రీడా నైపుణ్యాన్ని క్రికెట్ టోర్నీలో ప్రదర్శిస్తూ ఆహా అనిపిస్తున్నారు. నిర్వాహకులు ఆశించిన స్థాయి కంటే అధిక సంఖ్యలో క్రికెట్ జట్టులు టోర్నీలో భాగస్వాములు అయ్యాయి. క్రికెట్ టోర్ని క్రీడా పండుగను తలపిస్తుంది. వారం రోజులపాటు జరిగే క్రీడా సంబరాలు విద్యార్థులు- యువకులు-స్థానికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. సెలవుల్లో మరిన్ని టోర్నీలను నిర్వహించి గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసి జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించే వేదికగా మార్చాలని స్థానికులు ఆకాంక్షించారు. నిర్వాహకులు క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేశారు.

Media Cricket
Media Cricket

Leave a Reply