Manthani | అర్హులందరికీ పథకాలు..

Manthani | అర్హులందరికీ పథకాలు..
- దేవాలయాలను అభివృద్ధి చేస్తాం..
- మంథనిలోని ఆలయాల్లో మంత్రి శ్రీధర్ బాబు పూజలు
Manthani | మంథని టౌన్, ఆంధ్రప్రభ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ ఈ రోజు మంథనిలో పర్యటించారు. పట్టణంలోని పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెంజేరు కట్ట హనుమాన్ దేవాలయం, శ్రీ మహాగణపతి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆయన వివరించారు. దేవస్థానాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిందని ఆయన పేర్కొన్నారు. మంథని నియోజకవర్గ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పండగలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ముందస్తుగా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు
