Kareemabad | రోడ్డు భద్రత నియమాలు పాటించాలి..

Kareemabad | రోడ్డు భద్రత నియమాలు పాటించాలి..

  • జిల్లా కలెక్టర్
  • సమాజాన్ని చైతన్య పరచడంలో టీఎస్ జేయు పాత్ర అభినందనీయం
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

Kareemabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ, సామాజిక, ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణలో టీఎస్ జేయు ప్రత్యేకమ‌ని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతను పాటించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. టీఎస్ జేయు ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్బంగా అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించగా డి టి ఓ శోభన్, ట్రాఫిక్ సిఐ సుజాత, పలువురు పోలీస్ అధికారులు. పాల్గొన్నారు.

సమాజాన్ని చైతన్య పరచడంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ పాత్ర అభినందనీయమని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. శుక్రవారం టీఎస్ జేయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగోని ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కందికొండ మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వరంగల్ చౌరస్తా నుండి పోచమ్మ మైదాన్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా కలెక్టర్ సత్య శారద, ప్రత్యేక ఆహ్వానితులుగా వరంగల్ డిటిఓ శోభన్, ట్రాఫిక్ సిఐ సుజాత, జాతీయ యువజన అవార్డు గ్రహీత సామాజికవేత్త మండల పరశురాములు, వరంగల్ ఎమ్మార్వో శ్రీకాంత్, ఎన్ సీ సికెప్టెన్ సతీష్, ఇంతేజార్గంజ్ సీఐ షుక్రు, మాట్టేవాడ సిఐ కర్ణాకర్, ఎస్సైలు సందీప్, వెంకటేశ్వర్లు, రవికిరణ్, కుమార్ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రభుత్వ, సామాజిక, ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించడంలో టీఎస్ జేయు తన ప్రత్యేకతను చాటుతూ ఇతర యూనియన్లకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సమాజాన్ని చైతన్యపరచడంలో టీఎస్ జె యు పాత్ర అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను బాధ్యతగా పాటించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని అన్నారు. బైక్ నడిపే వాళ్ళు మాత్రమే కాకుండా వెనకాల కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించడం ఉత్తమమని సూచించారు.

గజిబిజి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, మానసిక ఒత్తిడులు, ఆలోచనలు ఉండటం సహజమని, అయినప్పటికీ వాటిని అధికమించుతో తమ ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. నిర్లక్ష్యంతో చేసే డ్రైవింగ్ వలన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని గ్రహించాలని, అంతేకాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరు బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు. ప్రజల భద్రత కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిటిఓశోభన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించ కూడదని, రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోవద్దని అన్నారు. ట్రాఫిక్ సిఐ సుజాత, ఇంతేజార్ గంజ్ సిఐ షుక్రు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, మీ భద్రతను దృష్టిలో పెట్టుకొని వాహనాలను నడపాలన్నారు. ర్యాలీలో కార్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ జె యు రాష్ట్ర నాయకులు తోకల అనిల్, నాగపురి నాగరాజు, నరేష్, వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు బత్తుల సత్యం, కందికొండ గంగరాజు, ఈద శ్రీనాథ్, లింగ బత్తిని కృష్ణ, అడుప అశోక్, నాగపూరి అవినాష్, కౌడగాని మోహన్, నీరుటి శ్రీహరి, మంతెన సురేష్, రావుల నరేష్, 28వ డివిజన్ అధ్యక్షుడు సంపత్ కుమార్, ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, మోటివేటర్ బరుపాటి గోపి, స్టూడెంట్స్, ధ్రువ, పద్మావతి కాళా శాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply