నూతన డీఆర్వోను కలిసిన ట్రెసా ప్రతినిధులు

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నూతనంగా నియమితులైన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వసంత కుమారిని ట్రెసా జిల్లా ప్రతినిధి బృందం సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది. డీఆర్వో ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో ట్రెసా జిల్లా అధ్యక్షుడు మార్క రామ్మోహన్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో రెవెన్యూ పరిపాలన సమర్థవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రెసా ప్రధాన కార్యదర్శి మహ్మద్ రజాక్, ట్రెజరర్ పకిడే రాజయ్యతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply