District Collector | ఏపీకి వాయుగండం

District Collector | ఏపీకి వాయుగండం

  • నేడు తీరం దాటనున్న తుఫాన్‌
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్

District Collector | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంగా బలపడిందని, ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి శ్రీలంకలోని హంబన్‌తోట, బట్టికోల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఇప్పటికే అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని, ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచామని కలెక్టర్ తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Leave a Reply