Singareni | బొగ్గు పరిశ్రమ పరిరక్షణకు పోరాటం

Singareni | బొగ్గు పరిశ్రమ పరిరక్షణకు పోరాటం

  • బొగ్గు బ్లాక్ లను కంపెనీకి అప్పగించాలి
  • టీబీజీకేఎస్ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్
  • గోదావరిఖనిలో సంఘం కోర్ కమిటీ సమావేశం

Singareni | గోదావరిఖని, ఆంధ్రప్రభ : 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకం కాబోతోందని… బొగ్గు పరిశ్రమ పరిరక్షణ కోసం ప్రత్యక్ష పోరాటాలు తప్పవని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ రోజు సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర స్థాయి కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై సుదీర్ఘంగా మాట్లాడారు.

వేల కోట్ల రూపాయల లాభాలను అర్జిస్తున్న సింగరేణి పరిశ్రమ ప్రస్తుతం ఆ సంస్థలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో అప్పుల కోసం వెతుకులాడే పరిస్థితి కనిపించడం దారుణం అన్నారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కొప్పుల ఈశ్వర్ గారు పిలుపునిచ్చారు.

Singareni |

సింగరేణి బొగ్గు పరిశ్రమ ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఏటీఎంలో మారిందని ఈశ్వర్ ఈ సందర్భంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. సింగరేణి రక్షించడానికి, కార్మికులకు జీతభత్యాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 48 వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి , చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొమురయ్య, కోర్ కమిటీ సభ్యులు పర్లపల్లి రవి, సతీష్, సంపత్ కుమార్, మంగీలాల్ , వీరభద్రం, ప్రభాకర్ రెడ్డి, సదానందం,వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, సాంబయ్య, శ్రీనివాసరావు, సంపత్, రమేష్, సమ్మయ్య, వెంకటేశ్వర్లు, రాజయ్య, శ్రీనివాసరావు జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

గోలేటి నుంచి సత్తుపల్లి వరకు కార్మిక యాత్ర : కోర్ కమిటీ నిర్ణయం

సింగరేణి పరిరక్షణ కోసం గోలేటి నుంచి సత్తుపల్లి వరకు కార్మిక యాత్ర నిర్వహించటానికి తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం కోరు కమిటీలో నిర్ణయించారు. మెడికల్ బోర్డు నిర్వహించాలని కమిటీ డిమాండ్ చేసింది. కార్మికుల సంక్షేమం, సింగరేణి భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను కార్మిక లోకానికి వివరించనున్నారు.

కోల్ బెల్ట్ ఏరియా వ్యాప్తంగా కార్మికులను చైతన్యపరిచేందుకు సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. వేలం లేకుండానే బొగ్గు గనులు కేటాయించాలని, ఆదాయ పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ మంత్రులను ఢిల్లీలో కలవాలని, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు .

Leave a Reply