Rs. 900 crore | ప్రభుత్వ ఆదాయానికి రూ.900 కోట్లు గండి పడినా…

Rs. 900 crore | ప్రభుత్వ ఆదాయానికి రూ.900 కోట్లు గండి పడినా…
- ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీని తీసుకొచ్చాం
- తెలంగాణ అసెంబ్లీలో రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Rs. 900 crore | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పీఎం ఈ డ్రైవ్ కింద 575 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, త్వరలోనే కొత్తగా 2800 ఈవీ(2800 EV) బస్సులు వస్తున్నాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాటితో పాటు వరంగల్ మున్సిపాలిటీకి 100, నిజామాబాద్ మున్సిపాలిటీకీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా 50 బస్సులు(50 buses) రాబోతున్నాయని వెల్లడించారు.
ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి పొన్నం మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీని తీసుకువచ్చామని చెప్పారు. ఈ ఏడాది కాలంలో లక్ష ఈవీ వాహనాలు అమ్ముడుపోయాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలలో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామన్నారు.
ఈవీ వాహనాల రాయితీ అమలుతో రూ. 900 కోట్ల(Rs. 900 crore) పన్ను ప్రభుత్వానికి నష్టం జరిగినప్పటికీ ఈవీ పాలసీ ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపు ఇవ్వాలని కంపెనీలను ఈ సందర్భంగా కోరామన్నారు.
ఎంఎన్‍సీ కంపెనీలు, పాఠశాలలు తమ వాహనాల్లో 25 నుంచి 50 శాతం వరకు ఈవీ వాహనాలు కొనుగోలు చేసేలా నిర్భంద విధానం తీసుకువచ్చేలా ప్రణాళిక ఆలోచిస్తామన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలని స్క్రాప్ పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జీవో తీసుకు వచ్చామన్నారు.
