Spectacular Saudi | ముగిసిన ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ బహుళ-నగర ప్రదర్శన

Spectacular Saudi| ముగిసిన ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ బహుళ-నగర ప్రదర్శన
Spectacular Saudi | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో మూడేసి రోజుల పాటు సాంస్కృతిక ఆవిష్కరణ, ప్రముఖుల చర్చలు, సౌకర్యవంతమైన ప్రయాణ ఆఫర్‌లను అందించిన ‘స్పెక్టాక్యులర్ సౌదీ(Spectacular Saudi)’ కార్యక్రమం విజయవంతంగా తన భారతదేశ యాత్ర ముగించుకుంది.

హైదరాబాద్‌లో శరత్ సిటీ మాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 200,000 మంది(200,000 people) సందర్శకులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. సౌదీ టూరిజం బ్రాండ్ ‘సౌదీ, వెల్‌కమ్ టు అరేబియా(Saudi, Welcome to Arabia)’ నిర్వహించిన ఈ కార్యక్రమం, ఆర్ట్ షోకేస్‌లు, కాఫీ, డేట్ అనుభవాలు, అర్దా డ్యాన్స్, అరబిక్ కాలిగ్రఫీ, కలినరీ అనుభవాలు, సహా పలు, కార్యకలాపాల ద్వారా సౌదీ ఆత్మ, సంస్కృతి, స్ఫూర్తిని ఒకచోట చేర్చింది, షీరాజ్ టూర్స్, అట్లాస్ ట్రావెల్స్, యాత్ర, ఫ్లిప్‌కార్ట్ + క్లియర్‌ట్రిప్, అక్బర్ హాలిడేస్, మేక్ మై ట్రిప్ కీలక వాణిజ్య భాగస్వాములు ఈ వేడుకలలో భాగమయ్యారు.

భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఐదు నగరాల ప్రదర్శన గురించి సౌదీ టూరిజం అథారిటీకి చెందిన APAC మార్కెట్స్ అధ్యక్షుడు అల్హాసన్ అల్దబ్బాగ్(Alhassan Aldabbagh) వ్యాఖ్యానిస్తూ, “భారతదేశానికి సౌదీ తిరిగి రావడం మన దేశాల మధ్య లోతైన సాంస్కృతిక అనుబంధాన్ని బలోపేతం చేసింది.
ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో, సౌదీ సంస్కృతి, వంటకాలు, కళ , నృత్యం పట్ల సానుకూల స్పందనను చూశామన్నారు. భారతదేశం అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా ఉందన్నారు. ఇరు దేశాల నడుమ ఎయిర్ కనెక్టివిటీ(Air Connectivity)ని మెరుగుపరుస్తూనే ఉన్నామన్నారు. భారతదేశం నుండి మరింత మంది సందర్శకులను స్వాగతించడానికి ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

