Srikakulam | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

Srikakulam | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి
Srikakulam | సోంపేట(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : జిల్లాలోని సోంపేట మండలం కొర్లం జాతీయ రహదారిపై ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఓ చిన్నారితో పాటుగా డ్రైవర్ మరో మహిళ కొన ఊపిరితో ఉండగా స్థానికుల సహకారంతో 108లో సోంపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు కొర్లం కూడలి నుండి బారువవైపు వెళ్తున్న కారును లారీ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికుల వెల్లడించారు. మృతులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. జరిగిన రోడ్డు ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో బారువ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

