Rs.10,016 /- | శ్రీ ధన మైసమ్మ అమ్మవారికి వెండి స‌మ‌ర్ప‌ణ‌….

Rs.10,016 /- | శ్రీ ధన మైసమ్మ అమ్మవారికి వెండి స‌మ‌ర్ప‌ణ‌….

Rs.10,016 /- | కరిమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ శివనగర్ లోని శ్రీ ధన మైసమ్మ అమ్మవారికి భరత్ కుమార్ ధనలక్ష్మి దంపతులు వెండి పాదాల కొరకు వెండి బహుకరించినారు. మెట్ల బావి, 34 డివిజన్, శివనగర్అ మ్మవారికి అరకిలో వెండితో వెండి పాదాలు చేయించడం జరుగుతుంది.

దానికిగాను ఈ రోజు శివనగర్ నాలుగు జెండాల వాస్తవ్యులు జగిత్యాలలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న గలాటి భరత్ కుమార్(Galati Bharat Kumar) – ధనలక్ష్మి పుణ్య దంపతులు అమ్మవారిని కోరిన కోరికను తీర్చినందుకుగాను అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సుల కోసం శ్రీ ధన మైసమ్మ అమ్మవారి వెండి పాదాలకు వెండికి రూ.10,016 /-(Rs. 10,016 /- for silver) (అక్షరాల పదివేల పదహారు రూపాయిలు ) రూపాయలను ఆలయ అధ్యక్షులు తోట బాబన్నకు అందజేశారు.

అనంతరం తోట బాబన్న అమ్మవారి చిత్రపటం అందజేసి కండువాతో పుణ్య దంపతులను సన్మానించడం జరిగింది. తోట బాబన్న మాట్లాడుతూ గలాటి భరత్ కుమార్ – ధనలక్ష్మి వారి కుటుంబ సభ్యులు హరీష్ కుమార్ – ప్రేమ, చైత్ర శ్రీ,, హిమ బిందు – సతీష్ కుమార్, తనుశ్రీ, తన్వి వారి కుటుంబ సభ్యులపై ఆ శ్రీ ధన మైసమ్మ అమ్మ వారి చల్లని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలే పూజారి వెంకన్న ఆశీర్వాదం అందచేశారు.

Leave a Reply