సోమిడికి చేరుకున్న మాజీ మావోయిస్టు దంపతులు.. ఘన స్వాగతం

సోమిడికి చేరుకున్న మాజీ మావోయిస్టు దంపతులు.. ఘన స్వాగతం

కాజీపేట, ఆంధ్రప్రభ

నాల్గున్నర దశాబ్దాల అజ్ఞాత పోరుబాటను వీడి, ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయిన సోమిడి గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నాయకుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఆయన సహచరిని ధనమ్మ దంపతులకు గురువారం రాత్రి కాజీపేటలో ఘన స్వాగతం లభించింది.

హైదరాబాద్ నుంచి కాజీపేటకు చేరుకున్న ఆ దంపతులను పట్టణవాసులు, సోమిడి గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులు స్వాగతించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక వాటర్ ట్యాంక్ ఆవరణలో పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సన్మానించారు.

అనంతరం గ్రామస్థులు బాణాసంచా కాలుస్తూ ర్యాలీగా వారిని సోమిడిలోని స్వగృహానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నరహరి దంపతులు శాంతి, అభివృద్ధి మార్గంలో కొత్త జీవితాన్ని విజయవంతంగా కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు.

Leave a Reply