Elections | అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం…

Elections | అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం…

  • జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్

Elections | చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులో బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. ఈ రోజు స్థానిక బీజేపీ కార్యాలయంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల(Municipal elections) సనహక సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా బీజేపీ అధ్యక్షుడు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ… దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో చెన్నూరు పట్టణ ప్రజలు అధిక మెజార్టీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అదే విధంగా ఇప్పుడు ముందున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా బీజేపీ ఆదరించడానికి సిధ్ధంగా ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో ఒక్క బీజేపీ మాత్రమే ధీటుగా సమాధానం ఇచ్చిందని చెప్పారు.

ప్రతి ఒక్క బీజేపీ బూతు స్తాయి నాయకులు కార్యకర్త పార్టీ నీ గెలిపించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, రాపర్తి వెంకటేశ్వర్, జాడి తిరుపతి, కొండపాక చారి, వెంకట నర్సయ్య, కమ్మల శ్రీనివాస్, ఏతం శివకృష్ణ,కాయిత వెంకటేష్, మౌనిక రౌత్ శంకర్, దుర్గాప్రసాద్, రాజన్న, శంకర్, వెంకట్, చిరంజీవి, శ్రీ వర్ధన్, మహిళా నాయకురాళ్ళు శ్రావణి, స్వరూప, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply