kalvakuntla kavitha | జలాశయాల నిర్మాణంతోనే నీటి నిల్వల పెంపు
kalvakuntla kavitha | జలాశయాల నిర్మాణంతోనే నీటి నిల్వల పెంపు
- ఎస్ఆర్ఎస్‌పీ కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి
- సాగుకు గోదావరి నీళ్లు అందించాలి
- రుద్రమ్మ చెరువును రిజర్వాయర్‌గా నిర్మించాలి
- జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
kalvakuntla kavitha | తిరుమలగిరి, ఆంధ్రప్రభ : ఎస్సారెస్పీ కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో సాగుకు నీళ్లు అందక సూర్యాపేట జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kavitha) కోరారు. ఈ రోజు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా జాజిరెడ్డిగూడెం మండలం సీతారాంపురం డీబీఎం 71 ప్రధాన కాలువను పరిశీలించారు. కాలువలకిరువైపులా లైనింగ్ ఏర్పాటు చేయలేదని కంపచెట్లు తొలగించడం లేరని రైతులు ఆమెకు తెలిపారు. జలాశయాల నిర్మాణంతోనే నీటి నిల్వలు పెరుగుతాయని, తద్వారా రైతులకు సాగునీరు అందుతుందన్నారు.

kalvakuntla kavitha | గురుకుల పాఠశాలను పరిశీలించిన కవిత
మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను కవిత పరిశీలించారు. అనంతరం రుద్రమ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పాలకులు, రుద్రమ్మ చెరువును 5 టీఎంసీలు గా రిజర్వాయర్ గా చేస్తామని చెప్పుతున్నారే తప్ప ఆచరణలో అమలు చేయడం లేరని అన్నారు. రుద్రమ్మ చెరువు రిజర్వాయర్ తో చుట్టూ 50 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని, దీనితో వ్యవసాయం చేసుకోవటానికి రైతులకు నీటి (Water) కొరత ఉండదని అన్నారు. ఈ ప్రాంతానికి కాలువల ద్వారా నీళ్లు రాక రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని, కిలోమీటర్ దూరం కాలువ పూర్తి చేయకపోవడంతో రైతులందరికీ నీళ్లు అందక సాగుకు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. డీబీఎం 70-71 కాల్వల మెయింటెనెన్స్ లేక చివరి ఆయకట్టుకు గోదావరి నీళ్లు అందడం లేవన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సారెస్పీ రెండో దశలో మూడు రిజర్వాయర్లు ఉంటే సూర్యాపేట జిల్లాకు వచ్చేసరికి ఒక్క రిజర్వాయర్ కూడా లేవన్నారు. కాలువలకు నీటి విడుదలతో మాత్రమే సాగు చేసుకోవలసిన దుర్భర పరిస్థితి ఉందన్నారు.

kalvakuntla kavitha | రిజర్వాయర్ల ఏర్పాటుతో పెరగనున్న నీటి నిల్వ సామర్థ్యం
రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తే నీటి నిల్వల సామర్థ్యం పెరిగి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని నీటి ఇబ్బందులు ఉండవని కవిత అన్నారు. రుద్రమ్మ, వెంపటి చెరువులను రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ (Demand) చేశారు. కస్తూరి పాఠశాలలో వానాకాలంలో నీటి నిలువలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని దోమల తో రోగాల బారిన పడుతున్నారని అధికారులు చర్యలు తీసుకొని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆమె అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా జాగృతి అధ్యక్షురాలు కృష్ణవేణి ఇస్మాయిల్ నకిరేకంటి సతీష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

