Kasturba School | ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి…

Kasturba School | ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి…

  • కస్తూర్బా గాంధీ ప్రత్యేకాధికారిణి బి.శ్యామల

Kasturba School | రెంజల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాల(Kasturba School) ప్రత్యేకాధికారిణి, ఆదర్శ వసతి గృహ ఇన్చార్జి బి.శ్యామల మాట్లాడుతూ… సంఘసంస్కర్త సావిత్రి బాయి 1831 జనవరి 3న జన్మించింది. ఆమెకు తొమ్మిదేళ్లకే జ్యోతిరావు పూలేతో వివాహం జరిపి, ఆమెకు తొలి గురువయ్యారు. కుల వివక్షతపై యుద్ధం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతువుల వివాహాలకు ప్రోత్సాహంగా పోరాటం చేసిన మొట్టమొదటి మహిళా వ్యక్తిగా గుర్తింపు పొందారన్నారు. 1848లో పుడెలోని “భీడే వాడ(Bheed himself)”లో దేశంలోనే మొదటి బాలికల పాఠశాల స్థాపించి, అందరికీ విద్యను అందించారు. ఉపాధ్యాయ బృందం ఎన్.శిల్ప, స్వప్న, శ్రీలత, సుజాత, రూప, స్రవంతి తదితరులు ఉన్నారు.

Kasturba School | దూపల్లి పాఠశాలలో…

దూపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంఘ సంస్కర్త, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు(Female Teacher) సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జరిపారు. చిత్రపటానికి పూల పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ మాధవరెడ్డి, పిఆర్టియు బాధ్యులు సోమలింగంగౌడ్ సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఉపాధ్యాయులు రాజేశ్వర్, ప్రభాకర్, రాములు, మయూరి ఉన్నారు.