Badawat Santosh | విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత

Badawat Santosh | విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత
- నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
Badawat Santosh | నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటానని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టరేట్ లో ఏడాది పాలన, ఈ సంవత్సరంలో చేపట్టనున్న అభివృద్ధి ప్రణాళికల గురించి వివరించారు.
విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలకు విద్యాశాఖకు ఆదేశాలిచ్చామన్నారు. చెంచు, గిరిజనులకు వైద్యం అందించడం జరుగుతుందన్నారు. తాను ఏడాదిన్నరలో అన్ని పీహెచ్సీలను సందర్శించానన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని మందులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. టీబీ నిర్మూలన స్క్రీనింగ్ చేపట్టామన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామన్నారు. మహిళా సంక్షేమం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కోసం మన్ననూర్, సోమశిల టూరిస్ట్ ప్రాంతాల్లో క్యాంటీన్లు కల్వకుర్తి, మన్ననూరులో పెట్రోల్ బంకుల ఏర్పాటు, సింగోటంలో సోలార్ విద్యుత్, విద్యార్థులకు దుస్తులు, ఇందిర సౌరగిరి జలవికాసం పథకంలో హార్టికల్చర్ తోటలకు అనుసంధానిస్తామన్నారు.
దాదాపు 8వేల ROFR భూముల్లో 2వేల ఎకరాల భూముల్లో అవకాడో, దానిమ్మలాంటి పండ్ల తోటల పెంపకానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఇటీవల గెలిచిన సర్పంచులకు శిక్షణ ఇస్తామన్నారు. భూభారతి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, జిల్లాలో
3వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రతి రోజూ ఒక మండలం చొప్పున ఈ డ్రైవ్ చేపడతామన్నారు.
3వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలో4వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. మండలాల వారీగా యూరియా నిల్వల వివరాలను ప్రతిరోజూ అందిస్తామన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. అక్రమాలకు పాల్పడితే ఆ దుకాణాలను బ్లాకులో పెడతామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చేపడుతామన్నారు. ఓటర్ జాబితాలో ఎలాంటి మార్పులు, చేర్పులు కావాలన్నా 8వ తేదీ వరకు ఓటర్లు చేసుకోవచ్చన్నారు.
