MLA | సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా..

MLA | సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా..
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : నూతన సంవత్సరంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా ముందుకు వెళ్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(MLA Venigandla Ramu) పేర్కొన్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజా వేదికలో 2026 నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికార, అనధికార ప్రముఖులు ఎమ్మెల్యే రాము – సుఖద దంపతులకు పూల మొక్కలు, నోట్ పుస్తకాలు అందజేసి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ముందుగా రాజేంద్రనగర్ లోని స్వగృహంలో… దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియచేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, క్రైస్తవ మత పెద్దలు, మైనార్టీ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజా వేదికలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అభిమానులు పార్టీ నాయకులకు ఏర్పాటుచేసిన నూతన సంవత్సర భారీ కేక్ లను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము కట్ చేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. వేడుక(celebrations)ల్లో భాగంగా దివ్యాంగ చిన్నారులు ఎమ్మెల్యే రాము దంపతులకు ప్రత్యేకంగా రూపొందించిన బహుమతులను అందించారు. వారితో కలిసి ఎమ్మెల్యే రాము దంపతులు న్యూ ఇయర్ కే కట్ చేశారు.
ఆర్డీవో బాలసుబ్రమణ్యం, కమిషనర్ మనోహర్, గుడివాడ జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మ సీనియర్ టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య, మార్కెట్ యార్డ్(market yard) చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, పలువురు ప్రముఖులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఎమ్మెల్యే రాము దంపతులకు, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.
