Pension | న్యూఇయ‌ర్‌ కానుకగా..

న్యూఇయ‌ర్‌ కానుకగా..

ల‌బ్ధిదారుల‌కు ముందస్తుగా పెన్షన్లు అంద‌జేత‌
పక్కిరపల్లిలో పండుగ వాతావరణంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పంపిణీ

Pension | కడప ప్రతినిధి, ఆంధ్రప్రభ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం లబ్ధిదారులకు ముందస్తు కానుకగా పెన్షన్ల పంపిణీ చేపట్టింది. కడప నగరంలోని 12వ డివిజన్ పక్కిరపల్లి ఎస్సీ కాలనీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు పండుగ వాతావరణంలో నిర్వహించారు. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన అందించే పెన్షన్లను నూతన సంవత్సర సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే 31వ తేదీనే పంపిణీ చేసింది. ముందుగానే పెన్షన్ అందడంతో లబ్ధిదారులైన అవ్వాతాతలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నూతన సంవత్సరాన్ని సంతోషంగా ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ముందస్తు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ముక్కర సుబ్బారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పార్టీ పరిశీలకులు కర్నాటి అమరనాథ్ రెడ్డి, పాలకొండ దేవస్థాన చైర్మన్ రెడ్డెయ్య యాదవ్, 4వ క్లస్టర్ ఇన్‌చార్జ్ ఫణి భూషణ రెడ్డి, 12వ డివిజన్ ఇన్‌చార్జ్ మణి భూషణ రెడ్డి, 10వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అందూరి రాజగోపాల్ రెడ్డి, 7వ డివిజన్ ఇన్‌చార్జ్ గొంటు ముక్కల చిన్న బాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ హాజీ, కడప సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోనం సిలాస్, నాయకులు రామసుబ్బారెడ్డి, నరేష్ రాజు పాల్గొన్నారు.అలాగే డివిజన్ నాయకులు శంకర్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి, బూత్ ఇన్‌చార్జ్‌లు వీరయ్య, గంగి రెడ్డి, సుబ్బరాయుడు, నరసింహ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, సురేష్, వెంకట రాజు, సుబ్బారెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply