Collector | భోజ‌నం బాగుంది..

అన్న క్యాంటీన్ క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ

Collector | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజలకు అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన, శుభ్రమైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మిర్చి యార్డులోని అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ పరిసరాల శుభ్రత, ఉదయం సరఫరా చేస్తున్న అల్పాహార నాణ్యతను పరిశీలించారు.

అల్పాహారం తీసుకుంటున్న కార్మికులు, మిర్చి అమ్మకానికి వచ్చిన రైతులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల డ్రైవర్లతో మాట్లాడి ఆహార నాణ్యతపై అభిప్రాయాలు సేకరించారు. అల్పాహారం తీసుకుని కలెక్టర్ స్వయంగా నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్య‌క్తం చేశారు. అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Leave a Reply