Megastar Victory | చిరు, వెంకీ కలిసి స్టెప్పేస్తే..

Megastar Victory | చిరు, వెంకీ కలిసి స్టెప్పేస్తే..

Megastar Victory | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ (Megastar) చిరంజీవి, విక్టరీ వెంకటేష్.. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ భారీ, క్రేజీ మూవీని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు. అయితే.. ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ లో చిరు, వెంకీ ల పై ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఇలా రిలీజ్ చేసారో లేదో.. అలా ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. మరి.. ఈ క్రేజీ మూవీ ఎలా ఉండబోతుంది..? అంచనాలను అందుకోవడం సాధ్యమేనా..?

Megastar Victory | చిరు, వెంకీ బాండింగ్ సూపర్..

ఒక‌రు మెగాస్టార్‌.. ఇంకొక‌రు విక్ట‌రీ (Victory) స్టార్‌… ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ద‌శాబ్దాలుగా అభిమానుల్ని అల‌రిస్తున్న‌వాళ్లే. ఇంకా చెప్పాలంటే.. నాటి నుంచి నేటికీ అలరిస్తున్నారు. యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే.. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. కలసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇప్పటికి కల నెరవేరింది. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరూ చేసిన సందడి తెర పై చూడాలంటే.. సంక్రాంతి వరకు ఆగాలి.

Megastar Victory

Megastar Victory | తెర పై భీభత్సమే..

అయితే.. వీరిద్దరు పాటలో చేసిన సందడి.. వారిద్దరూ వేసిన స్టెప్పులు.. ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిన అవసరం లేకుండా.. ఇప్పుడు పాట రిలీజ్ (Release) చేశారు. ఈ పాటలో ఏందీ బాసు సంగ‌తి.. అదిరిపోద్ది సంక్రాంతి అని వెంకీ… అంటే.. ఏందీ వెంకీ సంగ‌తి… ఇర‌గ‌దీద్దాం సంక్రాంతి.. అంటూ చిరు.. ఇద్ద‌రూ క‌లిసి ఓ రేంజ్ లో బీభ‌త్స‌మే చేసేశారు. ఈ సాంగ్ మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు అందరికి విపరీతంగా నచ్చేలా ఉంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. భీమ్స్ అదిరిపోయే ట్యూన్ అందించారు.

Megastar Victory

Megastar Victory | బ్లాక్ బస్టర్ ఖాయం..

చిరు, వెంకీల బాండిగ్, ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఈ పాట రాసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సాంగ్ సినిమా ప్రీ క్లైమాక్స్ లో వస్తుందని సమాచారం. చిరు, వెంకీల చేసిన డ్యాన్స్, అల్లరి చూసి తెగ సంబరపడి ఈ ఊపుతోనే అభిమానులు థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు. ఈ భారీ చిత్రాన్ని జనవరి 12న భారీ స్థాయిలో విడుద‌ల చేయనున్నారు. ఈ సినిమా (Movie) అంచనాలను అందుకుంటుందా అంటే.. ఇప్పటి వరకు ప్లాప్ అనేది లేకుండా అనిల్ రావిపూడి వరుసగా సక్సెస్ సాధించాడు. ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే టాక్ బలంగా ఉంది. సో.. మన శంకర్ వరప్రసాద్ గారు.. ఖచ్చితంగా అంచనాలు అందుకుంటాడని అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సక్సెస్ సందడి చేస్తారో చూడాలి.

Megastar Victory

CLICK HERE TO READ సితార బ్యానర్ లో సిద్ధు సినిమా..

CLICK HERE TO READ MORE

Leave a Reply