Green Welcome : భళా.. పోలీస్ భయ్యా Andhra Prabha SPL News

Green Welcome : భళా.. పోలీస్ భయ్యా Andhra Prabha SPL News
జాలీగా.. హ్యాపీగా.. ఎంజాయ్..
న్యూఇయర్ 2026 కు.. హరిత స్వాగతాంజలి
ప్రకృతి ప్రేమికుడి వినూత్న గ్రీనరీ సృజన
( ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో)

ప్రకృతి ప్రేమికుడు, ఏలూరు జిల్లా డీసీఆర్ బీ ఇన్ స్పెక్టర్ హబీబ్ బాషా వినూత్న ఆలోచనా పరుడు, పచ్చని మొక్కలతో నూతన సంవత్సరానికి (Green Welcome) ఆహ్వానం పలకిన వైనం.. అందరినీ ఆకర్షిస్తోంది. నూతన సంవత్సర వేడుకలంటే (New Year Celebration) కేవలం కేకులు, బాణాసంచా మాత్రమే కాదు.
ప్రకృతి తో మమేకమవ్వడం కూడా అని ఏలూరు జిల్లా పోలీస్ కేంద్రంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ (Eluru DCRB Inspector) మొహమ్మద్ హబీబ్ బాషా నిరూపించారు. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఆయన మొక్కలతో అత్యంత కళాత్మకంగా NEW YEAR రూపకల్పనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ,ముచ్చటగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Green Welcome : మొక్కల్ని ప్రేమించు..

హబీబ్ బాష (Habib Bhasha) తండ్రి వ్యవసాయ శాఖ (Agriculture Department) లో పనిచేయడంతో, వారికి చిన్నప్పటి నుండే ప్రకృతిపై మక్కువ ఏర్పడింది. ఒక గింజ (seed) మొలకెత్తడం వెనుక ఉన్న శ్రమ, ప్రతి మొక్క(plant) ఇచ్చే ప్రాణ వాయువు (Oxygen) విలువను ఆయన బాగా అర్థం చేసుకున్నారు.
తన కుటుంబం నుండి పొందిన ఈ విలువలే ఈరోజు ఆయనను ఒక పర్యావరణ ప్రేమికుడిగా తీర్చిదిద్దాయి. సాధారణంగా (Plastic coulors)_ ప్లాస్టిక్ రంగులు లేదా ఫ్లెక్సీలతో (Flexy Greetings) శుభాకాంక్షలు చెప్పడం చూస్తుంటాం. కానీ, పచ్చని మొక్కల ద్వారా శుభాకాంక్షలు తెలియ చేయడం ద్వారా ఆయన సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు.
Green Welcome : ఆ మొక్కలే కాపాడును..
మనం పర్యావరణాన్ని ప్రేమిస్తే, (Love Environ) అది మనకు (Healthy Life) ఆరోగ్యాన్ని,ఆనందాన్ని ఇస్తుంది” అని ఆయన ఈ క్రియద్వారా గుర్తుచేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే మనం భావితరాలకు ఒక మెరుగైన, పచ్చని ప్రపంచాన్ని ప్రాణవాయువును అందించగలమని ఆయన ఆకాంక్షించారు.
Green Welcome : ఆయన పోలీసే…

శాంతిభద్రతల పరిరక్షణలో బిజీగా ఉంటూనే, పర్యావరణం పట్ల ఇటువంటి సృజనాత్మక ఆలోచనలు చేయడం పట్ల ఉన్నతాధికారులు మరియు సహచర సిబ్బంది హబీబ్ బాషా గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. హబీబ్ బాషా చూపిన ఈ బాటలో మనమందరం పయనిస్తూ, ఈ నూతన సంవత్సరంలో కనీసం ఒక మొక్కనైనా నాటి పర్యావరణాన్ని గౌరవిద్దాం. ప్రకృతిని ప్రేమిద్దాం. పచ్చని భవిష్యత్తును నిర్మిద్దాం! (Happy Green New Year) నూతన సంవత్సర శుభాకాంక్షలు!
