First Award | కవి, జర్నలిస్ట్ ధర్మారావుకు శ్రమ అవార్డు…

First Award | కవి, జర్నలిస్ట్ ధర్మారావుకు శ్రమ అవార్డు…

First Award | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : సీఐటీయు అఖిల భారత మహాసభల నేపథ్యంలో, విశాఖపట్నం ఏయూ ఆవరణలో ప్రారంభమైన శ్రామిక ఉత్సవాల్లో ప్రముఖ కవి, జర్నలిస్ట్(Journalist) నల్లి ధర్మారావుకు శ్రమ అవార్డును ప్రదానం చేశారు. శతాధిక కవులు, రచయితల శ్రమగానం పేరుతో, శనివారం ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

తొలి రోజు సీనియర్ సంపాదకులు, సామాజిక, రాజకీయ విశ్లేషకులు, సాహితీవేత్త తెలకపల్లి రవికి తొలి అవార్డు(First Award)ను అందించారు. రెండో రోజు నల్లి ధర్మారావుకు, కళింగాంధ్రకు చెందిన మరో ప్రముఖ కవి గంటేడ గౌరు నాయుడుకు ప్రకటించారు. ఇద్దరూ కళింగాంధ్రకు సుపరిచితులే.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రజా కవుల్లో ఒకరిగా గుర్తింపు పొంది, గుర్రం జాషువా అవార్డు వంటి ప్రతిష్టాకరమైన కొన్ని అవార్డులు ధర్మారావుకు లభించాయి. ఉత్తమ జర్నలిస్టుగాను ఆయనకి అవార్డులు వచ్చాయి. కవి, రచయితగా నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన ప్రజల పక్షాన కవితలు, పాటలు(Poems, Songs) రచిస్తున్నారు.

కళింగాంధ్ర సమస్యలు, ఆవేదనలపై జర్నలిస్టుగా వ్యాసాలు రాస్తున్నారు. తుది శ్వాస వరకు తన కృషి ఈ మార్గంలోనే కొనసాగుతుందని అవార్డు తీసుకున్న తర్వాత, అదే వేదిక పై ధర్మారావు ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ అవార్డును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళింగాంధ్రకు చెందిన ప్రముఖ కవులు, రచయితలు, గాయకులు పాల్గొన్నారు. ధర్మారావు కూడా తను రచించిన కొన్ని పాటలు ఆలపించారు.

ఆయనకు ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించినందుకు జర్నలిస్టులుగా తమకు చాలా ఆనందంగా ఉందని విశాఖ, ఆదినారాయణ, శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకులు ఎన్ ఈశ్వరరావు, కార్యక్రమానికి హాజరైన వివిధ పత్రికల ప్రతినిధులు(Representatives) హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రజా సంఘాల సీనియర్ నాయకులు, న్యాయవాది బొడ్డేపల్లి మోహనరావు కూడా, ఆనందం వ్యక్తం చేశారు.