JCB | యథేచ్ఛగా అక్రమ మట్టి తోలకాలు

JCB | యథేచ్ఛగా అక్రమ మట్టి తోలకాలు
JCB | బోనకల్, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చిరునోముల గ్రామ రెవెన్యూలో ఇవాళ అసైన్డ్ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టి తోలకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ (Govt) ఆదాయానికి గండి కొడుతూ, మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా జేసీబీలతో తవ్వకాలు జరుపుతూ పదులకొద్ది ట్రాక్టర్లతో ఎర్ర మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోయారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అనుమతులు లేకుండా జరుపుతున్న మట్టి తోలకాలను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.
