Koratala | పవర్ స్టార్.. ఇది నిజమా..?

Koratala | పవర్ స్టార్.. ఇది నిజమా..?

Koratala | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ… దేవర సినిమా(Devara movie) వచ్చి సంవత్సరం దాటేసింది కానీ.. ఇంత వరకు కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేదు. ఆయన కథలు స్టార్ హీరోలకే సెట్ అవుతాయి. ఆయన స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తుంటారు. స్టార్ హీరోలు ఏమో ఫుల్ బిజీ(Full busy)గా ఉన్నారు. మీడియం రేంజ్ హీరోలను ట్రై చేస్తే.. వాళ్లు కూడా బిజీగానే ఉన్నారు. నాగచైతన్యతో కొరటాల సినిమా చేయాలి అనుకున్నారు. ఆతర్వాత ఏమైందో తెలియదు.. తాజాగా పవర్ స్టార్(Latest power star) పేరు వినిపిస్తోంది. పవర్ స్టార్ తో అయినా సెట్ అయ్యిందా..? అసలు ఏం జరుగుతోంది…?

Koratala | కొరటాల ప్రత్యేకత అదే..

Koratala

కొరటాల శివ.. మిర్చి సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) తో తీసి బ్లాక్ బస్టర్ సాధించి అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ జనాల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మళ్లీ సూపర్ స్టార్ మహేష్‌ తో భరత్ అనే నేను, మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్లో ఆచార్య సినిమాలు(Acharya movies) తెరకెక్కించారు. అయితే.. ఆచార్య సినిమా డిజాస్టర్ అయ్యింది. దీని నుంచి కోలుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. ఆయన తన సినిమాల్లో సమాజానికి ఉపయోగపడేలా మంచి సందేశం(Good message) చెప్పాలి అనుకుంటారు. అది ఆయన ప్రత్యేకత. అయితే.. జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో దేవర సినిమా చేయడం.. ఆ సినిమా నెగిటీవ్ టాక్ వచ్చినా.. 500 కోట్లు కలెక్ట్ చేయడం.. బ్లాక్ బస్టర్ అవ్వడం విశేషం.

Koratala | దేవర 2 సస్పెన్స్..

Koratala

దేవర సినిమాకి నెగిటీవ్ టాక్ రావడంతో దేవర 2 లేదనే ప్రచారం మొదలైంది. అయితే.. ఎన్టీఆర్ ఓ ఫంక్షన్(NTR’s function) లో.. అభిమానుల సమక్షంలో దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఇక దేవర 2 పై క్లారిటీ వచ్చేసింది అనుకుంటే.. ఎన్టీఆర్ ఊహించని విధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Magician Trivikram) తో సినిమాను ప్రకటించారు. ఇక అక్కడ నుంచి దేవర 2 లేదని వార్త మరోసారి తెర పైకి వచ్చింది. అయితే.. దేవర సినిమా రిలీజై సంవత్సరం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్(Makers’ special poster release) చేశారు. అంతే కాకుండా.. దేవర 2 ఉంటుందని కూడా మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Koratala | చైతూతో కొరటాల..

Koratala

దేవర 2 ఉంటుందని చెప్పినా.. దేవర 2 లేదని ప్రచారం జరిగినా.. ఉంటుందా..? ఉండదా..? అనే సస్పెన్స్(Suspense) గానే కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే.. కొరటాల నాగచైతన్యతో సినిమా చేయడం కోసం ఓ మాస్ స్టోరీ రెడీ చేసి లైన్ వినిపించారని లీకైంది. ఇక అక్కడ నుంచి చైతన్య, కొరటాల కాంబో ఫిక్స్(Koratala Combo Fix) అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ లేదని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అందుకనే.. చైతన్య నెక్ట్స్ మూవీని బెదురులంక డైరెక్టర్ క్లాక్స్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు అని.. ఏప్రిల్ లో అనౌన్స్ మెంట్ ఉంటుందని.. త్వరలోనే అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

Koratala | పవర్ స్టార్ తో కొరటాల..

Koratala

చైతన్యతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో.. కొరటాల పవర్ స్టార్ కోసం ఓ స్టోరీ లైన్ రెడీ(The story line is ready) చేశాడట. అంతే కాదండోయ్ ఇటీవల పవన్ కళ్యాణ్ కు కొరటాల కథ చెప్పడం కూడా జరిగిందని.. తెలిసింది. కథ విని పవన్ సున్నితంగా తిరస్కరించారట. కథ నచ్చక నో చెప్పారో.. లేక ఆయన ఓ వైపు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. మరో వైపు సినిమాలు కంప్లీట్(Movies Complete) చేయాల్సినవి ఉన్నాయి. అందుచేత కొరటాలతో సినిమా చేయాలంటే బాగా లేట్ అవుతుంది.. ఆయన్ని వెయిట్ చేయించడం అంత కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో నో చెప్పారా అనేది తెలియాల్సివుంది. మరి.. కొరటాల సినిమా ఎవరితో సెట్ అవుతుందో.. ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

CLICK HERE TO READ గుట్టు బయటపెట్టిన నిధి..

CLICK HERE TO READ MORE