2029 Elections | సీఎంవి కరప్షన్, డైవర్షన్ పాలిటిక్స్…
- అభివృద్ధి అవకాశాలు అందరికీ సమానంగా రావాలి
- ఇసుక దోపిడి నేటికి నడుస్తుంది
- సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నాం
- ప్రణాళికా బద్ధంగా పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తాం
- ప్రజల్లో తెలంగాణ జాగృతి నిలుస్తుంది
- తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మండలి శాసనసభ్యురాలు కల్వకుంట కవిత
2029 Elections | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాను సాగునీరు అందించడంలో, అభివృద్ధి చేయడంలో, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఈ జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఈ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు శాసనమండలి సభ్యురాలు కల్వకుంట కవిత విమర్శించారు.

ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో జాగృతి జనం బాటలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాను జాగృతి సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా బిజినపల్లి మండలం వట్టెం రిజర్వాయర్ ను సందర్శించారు. అనంతరం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని హిమాలయ హోటల్లో(Himalaya Hotel) నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… నాగర్ కర్నూలు జిల్లాలోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టామని ఆమె వివరించారు.
2029 Elections | రైలు కూత నేటికీ వినపడలేదు
సమస్యలపై అధికార పార్టీపై, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికీ దాదాపుగా రెండు నెలలుగా జిల్లాలలో పర్యటించామని తెలిపారు. ప్రధానంగా రైలు మార్గం నేటికీ నాగర్ కర్నూల్ కు రైలు కూత రాలేదని, ఇప్పటికైనా నాగర్ కర్నూల్ పార్లమెంటు(Parliament) సభ్యుడు రైలు మార్గాన్ని తెచ్చేలా కృషి చేయాలన్నారు.
మాచర్ల రైలు మార్గాన్ని తేవాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో అక్షరాస్యత పెరగలేదనీ, తెలంగాణలో, కృష్ణా జిల్లాల పంపిణీలో అన్యాయం జరిగిందని ఆమె వివరాలతో సహా వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇప్పటివరకు తట్టెడు మట్టి తీయలేదని ఆమె ఆరోపించారు.

డిండి ప్రాజెక్టు(Dindi Project) ఇప్పటివరకు నీళ్లు రాలేదని అన్నారు. వట్టెం రిజర్వాయర్ల కోసం, నల్ల మట్టి కోసం సేకరించిన 900 ఎకరాలను భూమిని, ఆ కాంట్రాక్టర్లు తోటలు, ఇతర అవసరాల కోసం వాడుకున్నారన్నారు. నల్ల మట్టిని మాత్రం చెరువుల నుండి తెచ్చి పోసారని ఆమె మండిపడ్డారు. 900 ఎకరాలు పేదలకు పంచాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా నీటి విషయంలో, జలాల పంపిణీలో అన్యాయం జరిగిందని, అదే పంతాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్, కరప్షన్ పాలిటిక్స్(Corruption Politics) చేస్తున్నాడని ఆమె ధ్వజమెత్తారు.
2029 Elections |పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో తట్టెడు మట్టి తీయలేదు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో మాజీ మంత్రి హరీష్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఆయన నిర్వాకం వల్ల మూడు మోటార్లే ఇప్పటికి పనిచేస్తున్నాయన్నారు. ఇంత అద్వాన పరిస్థితి నెలకొన్నదని ఆమె ఆరోపించారు. నీళ్లు ఇవ్వకపోవడం, పనులు జరగకపోవడం, నిధులు కేటాయించకపోవడం, వేగవంతంగా చేయకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఆమె ఆరోపించారు. అచ్చంపేట, కొల్లాపూర్ నాగర్ కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాలకు రావాల్సిన నీటిని ఇంకా ఇవ్వకపోవడం వల్ల బీడు భూములుగా మారాయని అన్నారు.
2029 Elections |జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయలేదు

మొత్తంగా జిల్లాకు రైల్వే(Railways) రాలేదు, సాగునీరు రాలేదు, నాగర్ కర్నూల్ రింగ్ రోడ్డు రాలేదు అని ఆమె అన్నారు. సమానమైన అభివృద్ధి జరగాలని అవకాశాలు కూడా సమానంగా ఉండాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తామని ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ జాగృతి పనిచేస్తుందని, నిర్మాణం పోరాటం చేస్తామని అన్నారు.
పెద్దల భూములు కాపాడి పేదల భూములు పోగొట్టారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించినా రెండు సంవత్సరాలు(Two Years) కాంగ్రెస్ పాలించిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదని ప్రజలకు ఆశించిన స్థాయిలో టిఆర్ఎస్ పరిపాలనలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పాలనలో కూడా అదే విధంగా కొనసాగుతున్నదని ఆమె విమర్శించారు.
2029 Elections | సేకరించిన 900 ఎకరాలను పేదలకు పంచాలి

రాబోయే కాలంలో తెలంగాణ జాగృతి నిలుస్తుందని వచ్చే రోజుల్లో ప్రజల్లో ఉండి నిర్మాణాత్మకమైన ప్రణాళికబద్ధమైన పాత్ర పోషిస్తామని అన్నారు. 2029 ఎన్నికల్లో(2029 Elections) పోటీ చేస్తామని రాజకీయంగా నిలదొక్కునేందుకు కృషి చేస్తామని ఆమె చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా బాధ్యులు వెంకటేష్, వెంకట్ గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
CLICK HER TO READ MORE రెండు రోజుల్లోనే.