Srikakulam | రథసప్తమి ఉత్సవాలకు రెడీ
Srikakulam | రథసప్తమి ఉత్సవాలకు రెడీ
- మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే గొండు శంకర్ చర్యలు
- భక్తుల రాకపోకలకు అవసరమైన రహదారులకు ప్రతిపాదనలు
Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జనవరి నెలలో జరగబోయే రథసప్తమి ఉత్సవాలకు అరసవల్లి పరిసర కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చర్యలు చేపట్టారు. శనివారం మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, హెల్త్ ఆఫీసర్, స్థానిక కూటమి నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి పర్యటించారు. ముఖ్యంగా కొయ్యని కన్నయ్య కాలనీ, తెలుగు ముసలయ్య కాలనీ, కామేశ్వర్ నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రధానమైన సమస్యలను గుర్తించి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా కాలువలు రహదారులు నిర్మాణం, పాత కాలువల్లో పూడికతీతలు, భక్తులకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయుట, హెల్త్ పరంగా అరసవెల్లి అర్థంప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శించి మెరుగైన వస్తువులు కల్పించేందుకు చర్యలు, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆదేశాలు, కమిషనర్ నగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకర పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో తక్షణం సరిదిద్దాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, నిత్యం పారిశుద్య పనులు సక్రమంగా నిర్వహించాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలకు అవసరమైన పార్కింగ్ స్థలాలను, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి గుర్తించారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్స్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, స్థానిక కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు, శానిటేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
