MLA | పార్టీ బలోపేతమే లక్ష్యం..

MLA | పార్టీ బలోపేతమే లక్ష్యం..

  • సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
  • క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం

MLA | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్. రాజ్ ఠాకూర్ శుక్రవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాక్స్ బోర్డు చైర్మన్ అజ్మతుల్ల హుస్సేన్, సుడా (SUDA) చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు.

MLA

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీని (Party) గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే పార్టీ ప్రజల్లో మరింత బలంగా నిలుస్తుందని సూచించారు. పార్టీ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేసే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడం ద్వారా ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగలమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply