Challapalli | ఘనంగా వంగవీటి వర్ధంతి

Challapalli | ఘనంగా వంగవీటి వర్ధంతి
Challapalli | చల్లపల్లి, ఆంధ్రప్రభ : స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతిని చల్లపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చల్లపల్లి పడమర వీధిలోని వంగవీటి మోహన రంగా విగ్రహానికి ఘంటసాల ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, చల్లపల్లి జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్, చల్లపల్లి పీఏసీఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు, బీజేపీ మండల అధ్యక్షులు అడపా రవి, మసీదు కమిటీ అధ్యక్షులు షేక్ నసీం ఘోరీ, కూటమినేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు
ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావిరాజేశ్వరరావు, న్యాయవాది తుటారం ప్రసాద్, గోళ్ళ ప్రసాద్, రాయవరపు నాంచారయ్య, షేక్ సిలార్, గోవాడ రాము, అడపా నాగేశ్వరరావు తదితర కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
