YSRCP office | పేదల హక్కుల కోసం..

YSRCP office | పేదల హక్కుల కోసం..
YSRCP office | గుడివాడ, ఆంధ్రప్రభ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక రాజేందర్ నగర్ లో వైయస్సార్ సీపీ కార్యాలయంలో కొడాలి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు ఎం వి నారాయణరెడ్డి, పాలేటి చంటి, తదితర నేతలు రంగ చిత్రపటానికి పూల మాలలతో నివాళులర్పించి జోహార్ వంగవీటి మోహనరంగా అంటూ నినాదాలు చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహన రంగా కృషి చేశారని కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రంగాని ఆరాధించడం సంతోషంగా ఉందన్నారు.
పేదల కోసమే రంగా పని చేశారని.. అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. రంగా ప్రజల మనిషి, పేదల నాయకుడు అని కొనియాడారు. రంగా అభిమానులు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని, ఓట్ల కోసం సిగ్గులేని రాజకీయాలు చేసే వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
రంగా ఆశయాలకు అనుగుణంగా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా ఎంతో కృషి చేశారని, రంగా చూపిన మార్గాలే మాకు ఆదర్శప్రాయమని కొడాలి నాని ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు అద్దేపల్లి పురుషోత్తం, అడబాల అప్పారావు, తోట శివాజీ, సింహాద్రి రాంబాబు, రేమల్లి నీలాకాంత్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, కోటప్రోలు నాగు, అల్లం రామ్మోహన్, నయనవరపు శేషు, అద్దేపల్లి హరి, హారిక, రమీజా, మాదాసు వెంకటలక్ష్మి, తోట సాయి, ఎస్కే బాజీ, షేక్ సయ్యద్, సమోసాలు నాని, తోట సాయి, కొడాలి శివ, కుమార్, జ్యోతుల మణికంఠ, అడపా హర్ష, రంగా అభిమానులు కొడాలి నాని అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
