Geetha Arts | తారక్ -త్రివిక్రమ్ మధ్య గొడవ జరిగిందా…?
Geetha Arts | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఇద్దరూ కలిసి మైథలాజికల్ మూవీ(A mythological movie) చేయాలి అనుకున్నారు. అయితే.. ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లింది. త్వరలోనే ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే.. మళ్లీ ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్(Allu Arjun) దగ్గరకు వచ్చిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై స్పందించిన బన్నీ వాసు మాటలు చూస్తుంటే.. తెర వెనుక ఏదో జరుగుతోంది అనిపిస్తుంది. ఇంతకీ.. బన్నీ వాసు ఏం చెప్పారు..? ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక ఏం జరుగుతోంది..?
Geetha Arts | ఫీలైన త్రివిక్రమ్..

అల్లు అర్జున్, త్రివిక్రమ్.. వీరిద్దరూ కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో.. అనే మూడు సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరోటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. ఈ క్రేజీ కాంబోలో నాలుగవ సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అఫిషియల్ గా అనౌన్స్(Officially announced) చేయడం కూడా జరిగింది. పుష్ప 2 తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేస్తారు అనుకున్నారు. అయితే.. బన్నీ.. త్రివిక్రమ్ తో కాకుండా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలని ఫిక్స్ అవ్వడంతో.. బాగా ఫీలైన త్రివిక్రమ్ వెంటనే.. ఎన్టీఆర్ కు కథ చెప్పి ప్రాజెక్ట్(project) ఓకే చేయించుకున్నారు. అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది.
Geetha Arts | ఊహించని ట్విస్ట్..

ఎన్టీఆర్ ప్రస్తుతం.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. దీనికి డ్రాగన్ అనే టైటిల్(The title Dragon) ప్రచారంలో ఉంది. అయితే.. మరో పవర్ ఫుల్ టైటిల్ కోసం చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ మూవీ కంప్లీట్ చేసి ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో సినిమాని స్టార్ట్ చేస్తారనుకుంటే.. ఊహించని ట్విస్ట్(An unexpected twist).. ఈ ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ దగ్గరకి వచ్చిందని వార్తలు రావడం. దీంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ.. అసలు ఏం జరుగుతోంది..? ముందుగా బన్నీ ఎందుకు వదులుకున్నాడు..? ఇప్పుడు ఎన్టీఆర్ ఎందుకు వదులుకున్నాడు..? అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక ఏం జరుగుతోంది… అనేది ఆసక్తిగా మారింది.
Geetha Arts | న్యూస్.. నిజమే..

ప్రచారంలో ఉన్న వార్తల పై బన్నీ వాసును మీడియా(Bunny Vasunu Media) అడిగితే.. ఇది సున్నితమైన విషయం. కొన్ని రోజులు ఓపిక పడితే అంత క్లియర్ గా తెలుస్తుంది. ఇదే కాదు.. బన్నీ చేసే రెండు సినిమాల గురించి కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేస్తామన్నారు. అది కూడా జనవరిలో ఈ అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పారు. బన్నీ వాసు మాటలను బట్టి.. ప్రచారంలో ఉన్న వార్త అవాస్తవం(Unreal) కాదు.. ఇది నిజమే అనేది క్లియర్ గా తెలుస్తుంది. నిజం కాకపోతే.. ఆ వార్తల్లో నిజం లేదు.. గాసిప్ అని చెప్పేవారు. బన్నీ.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లేదు అని చెప్పేవారు. అలా చెప్పలేదు.. త్వరలో తెలుస్తుంది.. జనవరిలో ప్రకటిస్తాం అన్నారంటే.. వైరల్(viral) అవుతున్న న్యూస్ నిజమే అని క్లారిటీ వచ్చేసింది.
Geetha Arts | జనాలకు షాకే..

బన్నీ, అట్లీతో మూవీని మే లేదా జూన్ కి కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తారు..? బోయపాటితో చేస్తారా..? లోకేష్ కనకరాజ్(Kanakaraj) తో చేస్తారా..? అని సినీ అభిమానులు అనుకుంటుంటే.. ఊహించని విధంగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చింది. ఇది అభిమానులకు.. ఇండస్ట్రీ జనాలకు షాకే. అసలు ఎన్టీఆర్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు అనేది హాట్ టాపిక్(Hot topic) అయ్యింది. అంతకు ముందు బన్నీ వదులకున్నప్పుడు కూడా కారణాలు బయటకు రాలేదు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఎందుకు వదులుకున్నారో బయటకు రాకపోవచ్చు.. ఏది ఏమైనా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ అఫిషియల్ అనౌన్స్ మెంట్(Latest official announcement) జనవరిలో రాబోతుంది. మరింత క్లారిటీ కావాలంటే.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.
