government | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
government | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
government | కడం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : ప్రభుత్వం అధికారుల అండతో, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి(Development) చేస్తామని చిట్యాల్ గ్రామ సర్పంచ్ చీమల భీమేష్ అన్నారు. కడం మండలం చిట్యాల్ జిపి గ్రామ సర్పంచ్ గా చీమల భీమేష్ ఉప సర్పంచ్ గా భగవంతురావు జిపి వార్డు సభ్యులను ఎస్ ఓ కడెం మండల డిప్యూటీ తహసిల్దార్ ఎం లచ్చిరాం ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎస్ ఓ లచ్చిరాం మొదటగా సర్పంచ్ గా చీమల భీమేష్, ఉప సర్పంచ్ గా భగవంతు రావు, వార్డు సభ్యులను ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చీమల భీమేష్, ఉప సర్పంచ్ భగవంతు రావు, వార్డు సభ్యులను గ్రామ పెద్దలు పలు పార్టీల నాయకులు(party leaders) మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు, అభిమానులు, స్థానిక పంచాయతీ సెక్రెటరీ సీబా సమరీన్, ప్రభుత్వ పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం నల్ల రాంరెడ్డి, ఎలగడప పిఎస్ హెచ్ఎం కూచనపల్లి శ్రీనివాస్, స్థానిక రేషన్ షాప్ డీలర్ ప్రశాంత్, అంగన్వాడీ టీచర్లు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన చీమల భీమేష్ మాట్లాడుతూ… చీమల భీమేష్గ్రామ పెద్దల, ప్రజల యువకులు, మహిళల సహకారంతో గెలిపించినందుకు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వ అధికారుల(government officials) గ్రామస్తుల సహకారంతో చిట్యాల్ జిపికు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
